Share News

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. కేరళలో ఉచిత వాటర్ పార్క్..

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:46 PM

వీకెండ్ వచ్చిందంటే చాలా మంది వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు అయితే వాటర్ పార్కులు, స్విమ్మింగ్స్ పూల్స్ వంటి వాటికి వెళ్తుంటారు. అలాంటి వారికి గుడ్‌న్యూస్.

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. కేరళలో ఉచిత వాటర్ పార్క్..
Kerala Tourism

ఇంటర్నెట్ డెస్క్: వీకెండ్ వచ్చిందంటే చాలా మంది వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు అయితే వాటర్ పార్కులు, స్విమ్మింగ్స్ పూల్స్ వంటి వాటికి వెళ్తుంటారు. ప్రతివారం వెళ్లాలంటే... ఇవి ఖర్చుతో కూడుకున్నవి. వీటి ఎంట్రీ టికెట్ ఎక్కువగా ఉంటుంది. ఖర్చులేకుండా నీటిలో జలకాలాడాలనే వారికి ఓ ముఖ్య సమాచారం. ఎటువంటీ ఎంట్రీ ఫీజులు లేకుండా ప్రకృతి ఒడిలో జలకాలాడే అవకాశం ఉంది. ప్రస్తుతం కేరళలోని సహజ సిద్ధమైన ఓ జల ప్రవాహం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూర్ సమీపంలోని టి.కె. కాలనీ (TK Colony) వద్ద ఉన్న ఓ సహజ జల ప్రవాహం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఎలాంటి కృత్రిమ స్విమింగ్ పూల్స్ గానీ, ఖరీదైన ప్రవేశ రుసుములు గానీ ఉండవు. ఇదొక పూర్తిగా ప్రకృతి సిద్ధమైన వాటర్ పార్క్. ఇక్కడ ప్రవహించే కాలువలో పర్యాటకులు ఎలాంటి భయం లేకుండా ఈత కొడుతూ ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు ఇక్కడ ఉన్న ఒక చెక్ డ్యామ్, సహజంగా ఏర్పడిన వాటర్ స్లైడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


రూపాయి ఖర్చు లేకుండా సహజ సిద్ధమైన నీటిలో ఈదులాటలు కొడుతూ, వాటర్ స్లైడ్‌పై జారుతూ పర్యాటకులు ఆనందిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటర్ పార్కుల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు, తక్కువ ఖర్చుతో ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఒక చక్కటి అద్భుతమైన ప్రదేశమని చెప్పవచ్చు. కేరళ పర్యటనకు వెళ్లేవారు వారి టూర్లో ఈ ప్రాంతాన్ని కచ్చితంగా యాడ్ చేసుకోవాలి.


ఈ వార్తలనూ చదవండి:

విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు

పూలు కోస్తూ 23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు మృతి

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!

Updated Date - Oct 30 , 2026 | 04:39 PM