Share News

కేరళం రాజకీయాల్లో ఈడీ కలకలం.. మాజీ సీఎం పినరయికి బిగ్ షాక్?

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:11 PM

కేరళం రాజకీయాల్లో ఈడీ కలకలం రేపుతోంది. మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తె, అల్లుడుపై అవినీతి కేసు నమోదు చేయాలని ED కోరిన నేపథ్యంలో ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.

కేరళం రాజకీయాల్లో ఈడీ కలకలం..  మాజీ సీఎం పినరయికి బిగ్ షాక్?
Kerala ED FIR Request Against Pinarayi Vijayan: Legal Opinion Received

పతనంతిట్ట (కేరళ), సెప్టెంబర్ 19: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టీ. వీణ, అల్లుడు.. ఎమ్మెల్యే పీ.ఏ. మహమ్మద్ రియాస్‌పై అవినీతి కేసు నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోరిన అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ అంశంపై కేరళ ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ (AG) నుంచి లీగల్ ఒపీనియన్ అందిందని రాష్ట్ర హోంమంత్రి రమేష్ చెన్నితల వెల్లడించారు. ఇవాళ (శనివారం) ఆయన పతనం తిట్టలో విలేకరులతో మాట్లాడారు.

ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత, ముఖ్యమంత్రితో సంప్రదించి చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని రమేష్ చెన్నితల స్పష్టం చేశారు. 'చట్టపరంగా చేయగలిగినదంతా చేస్తాం' అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీతో ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం లేదని, ఇది కేరళం రాష్ట్ర పరిధిలోనే పరిష్కరించుకోవాల్సిన విషయమని హోంమంత్రి తెలిపారు.

కొచిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పీఎమ్‌ఎల్‌ఏ (PMLA) కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు రియాస్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఈడీ లేఖ ద్వారా కోరింది. ఈడీ సోదాల్లో ఎలాంటి అక్రమ సొమ్ము లభించలేదని, కేంద్ర దర్యాప్తు సంస్థ వ్యాప్తి చేస్తున్నవన్నీ అబద్ధాలని మహమ్మద్ రియాస్ తీవ్రంగా మండిపడ్డారు. తన చివరి శ్వాస వరకు ఈడీపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు తన కుమార్తె సంస్థ సేవలందించి చట్టబద్ధంగా పన్నులు చెల్లించిందని, ఈడీ ఆరోపణల్లో నిజం లేదని పినరయి విజయన్ సమర్థించారు.


ఇవి కూడా చదవండి...

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

హఫీజ్‌పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్‌పై వేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 04:04 PM