Share News

బీజేపీ కీలుబొమ్మగా పోలీసు శాఖ

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:47 PM

తనపై అశ్లీలంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్థానిక నేతకు పోలీసులు మద్దతుగా వ్యవహరించడం గర్హనీయమని కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు.

బీజేపీ కీలుబొమ్మగా పోలీసు శాఖ

  • కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి ఆరోపణ

చెన్నై: తనపై అశ్లీలంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్థానిక నేతకు పోలీసులు మద్దతుగా వ్యవహరించడం గర్హనీయమని కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి(Karur Congress MP Jyothimani) ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖలలో బీజేపీ నాయకులకు ఉన్న పలుకుబడిని చూసి దిగ్భ్రాంతి చెందుతున్నానని పేర్కొన్నారు. ఇటీవల కరూర్‌లో జరిగిన ఓ సభలో బీజేపీ జిల్లా శాఖ నాయకుడు సెంథిల్‌ నాధన్‌ కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణిపై అశ్లీల పదజాలంతో తీవ్ర విమర్శలు చేశారు. ఈ సంఘటన పట్ల బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన కూడా చేశారు.


ఈ నేపథ్యంలో తనపై అసభ్యపదజాలంతో విమర్శలు చేసిన సెంథిల్‌నాధన్‌పై ఎంపీ జ్యోతిమణి కరూర్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆమె తన ఎక్స్‌ పేజీలో ఓ ప్రకటన జారీ చేస్తూ కరూరు జిల్లా పోలీసుల పనితీరు బీజేపీ నాయకులకు మద్దతునిచ్చే రీతిలో ఉందని, బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న తనపై బీజేపీ జిల్లా శాఖ నాయకుడు సెంథిల్‌నాధన్‌ బహిరంగంగా అసభ్య పదజాలంతో విమర్శలు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. బీజేపీ నేత సెంథిల్‌నాధన్‌ను ఉద్దేశపూర్వకంగా కరూర్‌ పోలీసులు అరెస్టు చేయడం లేదని,


nani3.2.jpgఅంతేకాకుండా ఆయనకు సులువుగా బెయిల్‌ లభించేందుకు అన్ని విధాలా సహకరిస్తుండటం సిగ్గుచేటైన విషయమని ఆమె మండిపడ్డారు. ఈ సంఘటనలను బట్టి పోలీసు శాఖ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని తేటతెల్లం అవుతోందన్నారు. తమిళ ప్రజలు పన్నుల రూపేణా చెల్లించే ధనంలో వేతనాలు పొందుతూ బీజేపీ అడుగులకు మడుగులొత్తేలా పనిచేసే పోలీసు శాఖ అవసరమా? అని జ్యోతిమణి ప్రశ్నించారు. మహిళలను కాపాడాల్సిన పోలీసులు నేరగాళ్లను కాపాడుతున్నారని, పోలీసు శాఖలో బీజేపీకి ఉన్న పలుకుబడిని చూసి తాను తీవ్ర దిగ్ర్భాంతి చెందుతున్నానని ఆమె పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2026 | 01:47 PM