కర్ణాటకలో దారుణం.. ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి నలుగురి సజీవదహనం
ABN , Publish Date - Sep 15 , 2026 | 07:23 PM
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి నలుగురు కుటుంబసభ్యులు సజీవదహనం కాగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలిన ఘటనలో నలుగురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే సజీవదహనం కాగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బెళగావి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజానన్(65), శారద(45) దంపతులు జిల్లాలోని సెంట్రల్ బస్టాండ్ సమీపంలో ఓ షేడ్‌లో నివాసముంటున్నారు. వారికి ప్రియ(24), గంగా(25), రోషన్(21)ముగ్గురు సంతానం ఉన్నారు. గజానన్ సోదరి భారతి(55) కూడా వారితో పాటే నివసిస్తున్నారు.
గజానన్ కుటుంబసభ్యులు వినాయక చవితి సందర్భంగా.. తమ నివాసంలో గణేశ్ పూజా ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం ఇంట్లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పూజ చేసిన అనంతరం భోజనం చేసి ఎప్పటిలాగానే తమ రిఫ్రిజిరేటచర్‌కు సమీపంలో నిద్రకు ఉపక్రమించారు. రోజంతా పండుగ హడావుడిలో అలసిపోవడంతో కుటుంబసభ్యులు త్వరగానే నిద్రలోకి జారుకున్నారు.
కాగా.. తెల్లవారుజామున 2:15 సమయంలో ఓ భారీ శబ్దం వినిపించడంతో ఇరుగుపొరుగు వారు బయటికి వెళ్లి చూడగా.. గజానన్ షేడ్‌లో మంటలు చెలరేగుతున్నాయి. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన రోషన్, గజానన్‌ను స్థానికులు రక్షించగలిగారు కానీ మిగిలిన నలుగురూ అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఇంట్లోని విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించిన అనంతరం రిఫ్రిజిరేటర్ పేలడంతోనే మంటలు చెలరేగినట్లు వారు గుర్తించారు. అయితే ఫ్రిడ్జ్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. రిఫ్రిజిరేటర్ పేలిందా లేక వినాయక విగ్రహం చుట్టూ అమర్చిన ఎలక్ట్రిక్ బల్బుల వల్ల సర్క్యూట్ ఏదైనా సంభవించిందా, అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా కప్: భారత పేసర్‌కు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ
ట్రోఫీకి బదులు వాటర్ బాటిల్.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫన్నీ సెలబ్రేషన్స్ వైరల్