Share News

తలనొప్పి ప్రసంగం.. రాహుల్‌పై కంగనా రనౌత్ విసుర్లు

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:16 PM

లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వినడం తలనొప్పిగా మారిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాహుల్ ప్రసంగం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అసలు విషయాలను రాహుల్ పక్కనపెట్టి తన వ్యక్తిగత విషయాలు, బాల్యం ముచ్చట్లు చెప్పడం తనకు తలనొప్పి కలిగించిందని అన్నారు.

తలనొప్పి ప్రసంగం..  రాహుల్‌పై కంగనా రనౌత్ విసుర్లు
Kangana Ranaut Vs Rahul Gandhi

న్యూఢిల్లీ: లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వినడం తలనొప్పిగా మారిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాహుల్ ప్రసంగం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అసలు విషయాలను రాహుల్ పక్కనపెట్టి తన వ్యక్తిగత విషయాలు, బాల్యం ముచ్చట్లు చెప్పడం తనకు తలనొప్పి కలిగించిందని అన్నారు. ఆయన ప్రసంగం ఒక న్యూసెన్స్‌లా ఉందని, స్పీకర్ కూడా పార్లమెంటరీ ప్రమాణాలకు లోబడే మాట్లాడాలని రాహుల్‌కు చెప్పారని అన్నారు. రాహుల్ ప్రవర్తన పార్లమెంటును హేళన చేసేలా ఉందని కంగనా రనౌత్ విమర్శించారు.


రాహుల్ గాంధీ తన ప్రసంగంలో డీలిమిటేషన్ బిల్లుపై విమర్శలు గుప్పించారు. ఇందువల్ల మహిళా సాధికారతకు ఒరిగేదేమీ ఉండదన్నారు. దేశ ఎలక్ట్రోరల్ మ్యాప్‌ను మార్చే ప్రయత్నమే జరుగుతోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇది కులగణనను బైపాస్ చేసే ప్రయత్నమేనని చెప్పారు. 'ఇది మహిళా బిల్లు కాదనేది మొదటి సత్యం. ఇందువల్ల మహిళా సాధికారికకు ఒరిగేదేమీ ఉండదు. ఇది దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నం మాత్రమే' అని అన్నారు. పార్లమెంటు, విధానసభల్లో ఓబీసీలకు అధికారంలో ప్రాతినిధ్యం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పుడు కులగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. విపక్షాలన్నీ దీన్ని ఓడిస్తాయని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ

ఇది మహిళా బిల్లు కాదు, 2023లోనే బిల్లును ఆమోదించాం: రాహుల్

Updated Date - Apr 18 , 2026 | 01:24 PM