Share News

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై దుమారం.. స్పందించిన కంగనా రనౌత్‌

ABN , Publish Date - Aug 25 , 2026 | 02:38 PM

కృతి సనన్‌ నటించిన రక్షా బంధన్‌ యాడ్‌పై సోషల్‌ మీడియాలో వివాదం నెలకొంది. ఆ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై విమర్శలు వస్తుండగా.. నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ కూడా స్పందించారు.

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై దుమారం.. స్పందించిన కంగనా రనౌత్‌
Kangana Ranaut On Kriti Sanon Raksha Bandhan Add

ఇంటర్నెట్ డెస్క్: నటి కృతి సనన్ నటించిన ఓ రక్షా బంధన్ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం రూపొందించిన ఈ ప్రకటనలో కృతి సనన్ ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ పండుగను ఇలా చూపించడం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు.


ఈ వివాదంపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. కృతి సనన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆమె నటించిన ప్రకటన గురించే తన వ్యాఖ్యలు అని కంగనా స్పష్టం చేశారు. ‘ఈ రోజుల్లో మహిళలకు ఎన్నో రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. చీరలు, లెహంగాలు, జీన్స్‌ నుంచి బికినీలు, సల్వార్‌ కమీజ్‌ వరకు ఏదైనా ధరించే స్వేచ్ఛ ఉంది. అలాంటప్పుడు సోదరుడికి బికినీలో రాఖీ ఎందుకు కట్టాలి? ఈ యాడ్‌ స్టైలిస్ట్‌కు మరో డ్రెస్‌ దొరకలేదా?’ అంటూ కంగనా ప్రశ్నించారు. ఈ యాడ్ చాలా అసహ్యంగా ఉందని కంగనా రనౌత్‌ తీవ్రంగా విమర్శించారు.

Kangana (2).jpg


మరోవైపు, ఆ ప్రకటనలో కుక్కకు రాఖీ కట్టిన సన్నివేశంపైనా కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుక్క తనపై మొరిగిన తర్వాత కృతి దానికి రాఖీ కడుతున్నట్లు ప్రకటనలో చూపించారు. ఈ వివాదంపై కృతి సనన్ ఇప్పటివరకు స్పందించలేదు.

Also Read:

కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ

Updated Date - Aug 25 , 2026 | 02:55 PM