Share News

కాక్రోచ్‌లను చూస్తే.. కక్కొస్తోంది!

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:17 AM

జెన్‌ జీ ఉద్యమం, కాక్రోచ్‌లపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు జెన్‌ జీ కాదు.. మురికి కాలువల తరం (జనరేషన్‌ గట్టర్‌) అని.. కాక్రోచ్‌లు అనే పేరును సార్థకం చేసుకున్నారని అన్నారు.

కాక్రోచ్‌లను చూస్తే.. కక్కొస్తోంది!
Kangana Ranaut

  • జెన్‌ జీ కాదు.. మురికికాలువల తరం..

  • రీల్స్‌, వీడియోల్లో అంతా అసభ్యత, అశ్లీలం

  • వాళ్లను ఎవరు కంటున్నారో, ఎవరు పెంచుతున్నారో..

  • కాక్రోచ్‌లపై కంగన వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, జూలై 28: జెన్‌ జీ ఉద్యమం, కాక్రోచ్‌లపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు జెన్‌ జీ కాదు.. మురికి కాలువల తరం (జనరేషన్‌ గట్టర్‌) అని.. కాక్రోచ్‌లు అనే పేరును సార్థకం చేసుకున్నారని అన్నారు. ‘‘నా జీవితంలో ఒకేచోట ఇంత అసహ్యకరమైన దృశ్యాలను ఎప్పుడూ చూడలేదు. జెన్‌ జీ నిరసనల నుంచి వచ్చిన రీల్స్‌ వాంతి వచ్చేలా ఉన్నాయి. అక్కడ చేరినవారికి చదువు సంధ్యల్లేవు. వారు సంస్కారంతో పెరగలేదు. వారిని ఎవరు కంటున్నారో, ఎవరు పెంచుతున్నారో, ఎలా పెంచుతున్నారో. ఉద్యమంలో పాల్గొన్న హిందూ మహిళలు కూడా విదేశీ సంస్కృతి మోజులో పాడైపోయారు. డ్రగ్స్‌, మద్యం మత్తులో నిస్సిగ్గుగా జీవిస్తూ, దానినే స్వేచ్ఛగా చెప్పుకొంటున్నారు. వారు గృహిణులుగా/భార్యలుగా ఉండటానికి కూడా పనికిరారు. వాళ్ల రీల్స్‌లో అంతా అసభ్యత, అశ్లీలం. వాటిని చూసి తీవ్రంగా కలత చెందాను’’ అంటూ కంగన పోస్టు పెట్టారు.


నేనుంటే.. కాల్చిపడేసేవాడిని

కాక్రోచ్‌ల ఉద్యమంపై ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతకర్త టీజీ మోహన్‌దాస్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. జంతర్‌మంతర్‌ ఉద్యమాన్ని పోలీసులు సరిగ్గా నియంత్రించలేకపోయారని.. తానే గనుక అక్కడ ఉంటే.. కర్ఫ్యూ పెట్టి, ఆందోళన చేస్తున్న విద్యార్థులను కాల్చి పడేసేవాడినని ఓ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో మోహన్‌దాస్‌ వ్యాఖ్యానించారు. అత్యాచారాలకు గురికావడాన్ని కొందరు మహిళలు బాగా ఆస్వాదిస్తున్నారని కూడా పేర్కొన్నారు. దీంతో మోహన్‌దా్‌సపై చర్య తీసుకోవాలంటూ ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థి నాయకులు మంగళవారం కేరళ పోలీస్‌ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, మోహన్‌దాస్‌ వ్యాఖ్యలను ఆర్‌ఎ్‌సఎస్‌ ఒక ప్రకటనలో ఖండించింది. మోహన్‌దాస్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొంది.

Updated Date - Jul 29 , 2026 | 07:17 AM