గుజరాత్ తీరంలో రెండు వాణిజ్య నౌకలు ఢీ.. రంగంలోకి దిగిన తీర రక్షక దళం
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:02 AM
గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు సమీపంలో రెండు వాణిజ్య నౌకలు ఢీకున్నాయి. ఎంవీ ట్రూ మారినర్ వాణిజ్య నౌక, ఎంవీ కేమ్యాక్స్ ఎంపీరర్ వాణిజ్య నౌకలు ఢీకొన్నాయి.
గాంధీనగర్, సెప్టెంబర్ 12: గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు సమీపంలో రెండు వాణిజ్య నౌకలు ఢీకున్నాయి. శుక్రవారం రాత్రి ఎంవీ ట్రూ మారినర్ వాణిజ్య నౌక, ఎంవీ కేమ్యాక్స్ ఎంపీరర్ వాణిజ్య నౌకలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి 21 మంది నౌకా సిబ్బందిని రక్షించామని భారత తీర రక్షక దళం శనివారం వెల్లడించింది. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో 24 మంది ఉన్నారని పేర్కొంది. నౌకలో కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు ముగ్గురు నౌకలోనే ఉండిపోయారని వివరించింది. నౌకలు ఢీకొనడం వల్ల చమురు లీకయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎలాంటి కాలుష్య సమస్య ఉత్పన్నమైనా.. వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
సముద్ర భద్రతతోపాటు గుజరాత్ తీరప్రాంత పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపింది. అందుకోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌తోపాటు కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నట్లు భారత తీర రక్షక దళం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
త్వరలో భారత మార్కెట్లోకి కోహియర్
For More National News And Telugu News