Share News

పాత్రలు తోమే స్థితి నుంచి.. మంత్రి స్థాయికి చేరిన మహిళ

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:24 PM

పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనోపాధి సాగించి ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాఝీకు మంత్రి పదవి వరించింది.

 పాత్రలు తోమే స్థితి నుంచి..  మంత్రి స్థాయికి చేరిన మహిళ

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో ఇళ్లలో పని మనిషికిగా ఉన్న ఓ మహిళా నేడు అనూహ్యంగా రాష్ట్ర మంత్రిగా మారింది. అంతేకాక కీలకమైన గృహ నిర్మాణ శాఖ బాధ్యతలను ఆమె స్వీకరించారు. ఇంటిని చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించినట్లుగా రాష్ట్రాభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేసేందుకు సిద్ధమయ్యారు. నాడు పాత్రలు తోమిని చేతులతో నేడు పరిపాలన పగ్గాలు చేపట్టి.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇంతకీ ఆమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...


పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారులు మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. కీలకమైన హోంశాఖను తన వద్దే ఉంచుకున్నారు. పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనోపాధి సాగించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన కలితా మాఝీ (Kalita Majhi)కి మంత్రి పదవి దక్కింది. ఆమెకు గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఔస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి ఆమె త్రుణముల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాఝీ విజయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న ఒక కీలక మార్పును సూచించింది.Kalitha-Janjuri.jpg


కష్టాలతో సాగిన జీవితం

కలితా 2006లో ఒక ప్లంబర్‌ను వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే వారి కుటుంబం గడిచే స్థితిలో ఉంది. అందుకే ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి గుస్కారాలోని రెండు ఇళ్లలో పని మనిషిగా మారింది. ఇళ్లల్లో పని చేస్తూ నెలకు రూ. 4,500 సంపాదిస్తుండే వారు. ఆమెకు రాజకీయాలపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉండేది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల స్ఫూర్తితో, ఆమె బీజేపీ ర్యాలీలకు హాజరవుతూ ఉండే వారు. అనూహ్యంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ సంపాదించి.. ఏకంగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె కేవలం గెలవడమే కాకుండా లక్షలాది మంది మహిళలకు ఆశాకిరణంగా నిలిచారు. తాను ఎమ్మెల్యే అయినా, మంత్రిని అయినా.. సాధారణ మహిళనేనని, తన లాంటి వారి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానని కలితా స్పష్టం చేశారు. గతంలో ఈమె అభయ్ కుంభకోణంపై పోరాటం చేసి వెలుగులోకి వచ్చారు.


మంత్రులు- వారి శాఖలు

  • తపస్‌ రాయ్‌- పరిశ్రమలు, వాణిజ్య శాఖ

  • దిలీప్‌ ఘోష్‌- పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ

  • అగ్నిమిత్ర పాల్‌- పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల శాఖ

  • డాక్టర్ శరద్వత్ ముఖర్జీ- ఆరోగ్య శాఖ

  • జగన్నాథ్ ఛటోపాధ్యాయ- ఉన్నత విద్యాశాఖ

  • దూద్ కుమార్ మండల్- వ్యవసాయ శాఖ

  • దీపక్ బర్మన్- పాఠశాల విద్యాశాఖ

  • శంకర్ ఘోష్‌- పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు

  • అర్జున్ సింగ్‌- కార్మిక, రవాణా శాఖ

  • ఇంద్రనీల్ ఖాన్ -క్రీడలు, యువజన, వినియోగదారుల వ్యవహారాల శాఖ

  • మాలతీ రావ రాయ్‌- మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ


ఇవి కూడా చదవండి..

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌ నేతలు..

మమతకు షాక్.. టీఎంసీకి మరో ఎంపీ రాజీనామా..

Updated Date - Jun 10 , 2026 | 05:02 PM