బస్సు బ్రేకులు ఫెయిల్.. పెను ప్రమాదాన్ని తప్పించిన రియల్ హీరో కండక్టర్!
ABN , Publish Date - Oct 30 , 2026 | 07:45 PM
జార్ఖండ్‌లోని దుమ్కాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిలై కావడంతో బస్సు అదుపు తప్పింది. ఇదే సమయంలో ఓ కండక్టర్ తన సమయస్ఫూర్తితో ప్రమాదాన్ని తప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని దుమ్కాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిలై కావడంతో బస్సు అదుపు తప్పింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో ఓ కండక్టర్ సమయస్ఫూర్తితో ప్రమాదాన్ని తప్పించాడు. బస్సు బ్రేకులు ఫెయిలై.. వెనక్కి వెళ్తున్న సమయంలో ఏ మాత్రం భయపడకుండా అతను వ్యవహరించిన తీరు పలువురి ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దుమ్కా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలయ్యాయి. ఆ ప్రాంతంలోని రోడ్డు ఏటవాలుగా ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం ప్రారంభించింది. బస్సు అదుపుతప్పి వెనక్కి వెళ్లడాన్ని గమనించిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో ఒక్కొక్కరు బస్సులో నుంచి కిందకు దూకారు. ఒక వైపు ప్రయాణికులు బస్సులో నుంచి దూకుతుంటే.. మరోవైపు కండక్టర్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించాడు.
బస్సు వేగంగా వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు వెంటనే పెద్ద పెద్ద బండరాళ్లను సేకరించి చక్రాల కింద వేయడం ప్రారంభించాడు. అతని ఈ సమయస్ఫూర్తి వల్ల బస్సు వేగం క్రమంగా తగ్గి చివరకు పూర్తిగా నిలిచిపోయింది. కండక్టర్ సమయస్ఫూర్తి కారణంగా వల్ల ఘోర ప్రమాదం తప్పిందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని సమాచారం.
ఈ ఘటన సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాద సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రయాణికులను కాపాడిన కండక్టర్ తెగువను నెటిజన్లు, స్థానికులు తెగ అభినందిస్తున్నారు. అతడు రియల్ హీరో అంటూ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ జెట్ తొలిసారిగా లాండింగ్
భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో పార్సిల్ సేవలు..
ట్రిపుల్ మర్డర్ కలకలం.. 22 సెకన్లలో 5 రౌండ్లు కాల్పులు..