చైనా చమురు రంగంపై యుద్ధ ప్రభావం
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:26 PM
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల ప్రభావం చైనా చమురు రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. జెజియాంగ్ పెట్రోకెమికల్‌లో ఉత్పత్తయ్యే 2 లక్షల బ్యారెళ్ల యూనిట్‌ను చైనా మూసివేసింది.
న్యూఢిల్లీ, మార్చి 03: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల ప్రభావం చైనా చమురు రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. జెజియాంగ్ పెట్రోకెమికల్‌లో ఉత్పత్తయ్యే 2 లక్షల బ్యారెళ్ల యూనిట్‌ను చైనా మూసివేసింది. మార్చి నెలలో జెజియాంగ్ పెట్రోకెమికల్స్ తన ఉత్పత్తిలో 20 శాతాన్ని తగ్గించింది. రోజుకు 8 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే అతిపెద్ద రిఫైనరీగా ఈ పెట్రో కెమికల్స్ ఉంది.
మరోవైపు ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్దం కారణంగా భారత పరిశ్రమలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పలు పరిశ్రమలకు ఎల్‌ఎన్‌జీ సరఫరాను వివిధ భారత్ కంపెనీలు తగ్గించాయి. పరిశ్రమలకు 10% నుంచి 30% వరకు ఎల్ఎన్‌జీ సరఫరాను కంపెనీలు తగ్గించాయి. ఈ మేరకు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ నుంచి గెయిల్, ఐఓసీకి సమాచారం అందింది.
మధ్య ప్రాచ్య ఎల్‌ఎన్‌జీ సరఫరాపై భారత్ అధికంగా ఆధారపడిన విషయం విదితమే. ఖతార్ ఎల్‌ఎన్‌జీకు భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ఖతార్‌లో ఎల్ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పశ్చిమాసియా ఘర్షణల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి
తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులు
For More National News And Telugu News