పశ్చిమాసియా ఘర్షణల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:57 PM
పశ్చిమాసియా ఘర్షణలో ఇప్పటి వరకూ ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మంగళవారంనాడు తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక చర్యలు తీవ్రమవుతుండటంతో ప్రధానమైన వాణిజ్య మార్గాల్లో అంతరాయం కలుగుతోందని పేర్కొంది.
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఘర్షణలో ఇప్పటి వరకూ ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మంగళవారంనాడు తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ సైనిక చర్యలు తీవ్రమవుతుండటంతో ప్రధానమైన వాణిజ్య మార్గాల్లో అంతరాయం కలుగుతోందని పేర్కొంది.
'వాణిజ్య నౌకలపై నాలుగు దాడి ఘటనలు జరిగినట్టు సమాచారం ఉంది. ముగ్గురు నావికులు మృతి చెందగా, ఒక నావికుడు గాయపడ్డారు. వీరంతా విదేశీ జెండాలున్న నౌకల్లో సేవలందిస్తున్నారు' అని డీజీఎస్ తెలిపింది. కీలక వాణిజ్య మార్గాలైన గల్ఫ్ ఆఫ్ ఒమన్, హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో పరిస్థితులను నిశితంగా గమనినిస్తున్నామని, ఆయా మార్గాల్లో భద్రతను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని షిప్పింగ్ ఆపరేటర్లకు సూచనలిచ్చామని పేర్కొంది. అనుమానాస్పద కార్యక్రమాలపై వెంటే రిపోర్ట్ చేయాలని కోరినట్టు తెలిపింది. వాణిజ్య నౌకలు, సిబ్బందిపై దాడులు పెరుగుతున్నందున ప్రమాదం ఎక్కువగా ఉన్న రూట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 200కు పైగా నౌకలు ఆ రూట్లకు దూరంగా ఉండటం, లంగరు వేసి ఉంచడం జరుగుతోంది.
కాగా, ఇప్పటి వరకూ రక్షించిన సిబ్బందిని స్వదేశానికి రప్పించడానికి ఒమెన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు తీసుకుంటున్నట్టు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ నావికులకు తక్షణసాయం, భారత్ తరలింపున ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సిబ్బంది కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాల్సిందిగా షిప్పింగ్ కంపెనీలకు సూచించామని వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఖమేనీ మృతిపై భారత్ మౌనం.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనియా గాంధీ..
బ్యారెల్ చమురు.. 100 డాలర్లకు?