Share News

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:33 PM

గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక లోపం ఏర్పడింది.

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 01: గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన విమానం పైలట్ వెంటనే మనోహర్ ఎయిర్ పోర్ట్ అధికారులకు తెలియజేశారు. వారి అనుమతితో ఈ విమానాన్ని అత్యవసరంగా గోవా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఇండిగో విమానం (6E 2102) అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంతో గోవా ఎయిర్‌పోర్టులో అధికారులు ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ విమానంలోని ప్రయాణికులను ఢిల్లీ తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం ఈ సందర్భంగా వెల్లడించింది. అందుకోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది.


ఈ విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు కనుగొన్నారని వివరించింది. విమానంలో ఏర్పడిన సమస్యను గుర్తించే పనిలో సాంకేతిక సిబ్బంది ఉన్నారని పేర్కొంది. ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఇండిగో సంస్థ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎన్‌జీ బంకులో ఊహించని ప్రమాదం.. వీడియో వైరల్

సీఎం ఆదేశాలను.. ఆటో డ్రైవర్ ఎలా పాటిస్తున్నాడో చూస్తే..

For More National News And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 01:50 PM