Share News

రైళ్లలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర.. రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడి

ABN , Publish Date - May 20 , 2026 | 06:02 PM

రైళ్లలో ఇటీవల జరిగిన వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉందని రైల్వే శాఖ తెలిపింది. అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పేర్కొంది.

రైళ్లలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర.. రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడి
Trian fire accidents

న్యూఢిల్లీ: రైళ్లలో ఇటీవల జరిగిన వరుస అగ్నిప్రమాదాలు జరగడం వెనుక కుట్ర ఉందని రైల్వే శాఖ తెలిపింది. అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పేర్కొంది. రాజస్థాన్‌లోని అమర్‌పుర, కోటా, బిహార్‌లోని ససరాం, బెంగాల్‌లోని హౌరాలో నాలుగు వేర్వేరు రైళ్లలో ఇటీవల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలపై ఆర్‌పీఎఫ్ దర్యాప్తు జరపడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.


వరుస అగ్నిప్రమాద ఘటనలపై రైల్వే శాఖ బుధవారంనాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమరపుర ఘటనలో బెడ్డింగ్ మెటేరియల్‌కు నిప్పు పెట్టారని తెలిపింది. హౌరాలో పెట్రోల్‌లో ముంచిన క్లాత్‌ను మంటల్లో తగులబడిన బోగీ బాత్‌రూమ్‌లో గుర్తించామని పేర్కొంది. కోటాలోని రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో కూడా బాత్‌రూమ్ నుంచి మంటలు మొదలయ్యాయని, ససరాంలో ఖాళీ బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మండే వస్తువును విసిరినట్టు తమ దర్యాప్తులో తేలిందని వివరించింది.


ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139కు సమాచారం ఇవ్వాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.


ఇవి కూడా చదవండి..

మంత్రివర్గ విస్తరణకు విజయ్ రెడీ.. 15 మందికి చోటు

మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ

Updated Date - May 20 , 2026 | 06:10 PM