Circular Journey Ticket: ఒక్క రైలు టికెట్‌తో దేశమంతా జర్నీ.. ఎలానో తెలుసా?
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:46 PM
ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. కానీ చాలా మందికి ఇండియన్ రైల్వే అందించే అనేక సౌకర్యాల గురించి తెలియదు. అలాంటి వాటిల్లో 'సర్క్యులర్ జర్నీ టికెట్' ఒకటి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి ఈ టికెట్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. కానీ ఇండియన్ రైల్వే అందించే అనేక రైల్వే సౌకర్యాల గురించి చాలా మంది ప్రయాణికులకు తెలియదు. అలాంటి వాటిల్లో 'సర్క్యులర్ జర్నీ టికెట్'(Circular Journey Ticket) ఒకటి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి ఈ టికెట్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరి.. ఈ 'సర్క్యులర్ జర్నీ టికెట్' అంటే ఏమిటి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సర్క్యులర్ జర్నీ టికెట్
ఒక స్టేషన్‌లో ప్రయాణం ప్రారంభమై తిరిగి అదే స్టేషన్ దిగడంతో ముగిసే ప్రయాణాలకు సర్క్యులర్ జర్నీ టికెట్(Circular Journey Ticket) జారీ చేయబడుతుంది. ఈ టికెట్ యాత్రికులు, పర్యాటక బృందాలు లేదా ఒకేసారి అనేక నగరాలను చూడాలనుకునే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రయాణ టికెట్‌తో మీరు 8 నగరాలు, స్టేషన్లలో ఎక్కవచ్చు, దిగవచ్చు. అలానే మీరు అనేక రైళ్లలో ప్రయాణించవచ్చు. అందుకే ఈ టికెట్ యాత్రికులు, టూర్ ప్లానర్లకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.
56 రోజుల వరకు చెల్లుబాటు
రైల్వే నిబంధనల(Indian Railways ) ప్రకారం.. సర్క్యులర్ జర్నీ టికెట్(Circular Journey Ticket) 56 రోజుల వరకు చెల్లుతుంది. దీని అర్థం ప్రయాణీకులు తమ టూర్ ప్లాన్ ప్రకారం అడపాదడపా ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణాలు చేసే సమయంలో పదే పదే టికెట్లను బుక్ చేసుకోవాల్సిన శ్రమ ఉండదు. సర్క్యులర్ జర్నీ టికెట్ సాధారణ టిక్కెట్ల ధరల కంటే తక్కువగా ఉంటాయి. కారణం.. ప్రయాణంలో ఎక్కువ స్టేషన్లు చేర్చబడితే, టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. మీరు ఉత్తర రైల్వే ద్వారా న్యూఢిల్లీ నుంచి కన్యాకుమారికి సర్క్యూలర్ జర్నీ టికెట్ కొనుగోలు చేయవచ్చు. మీ ప్రయాణం న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై న్యూఢిల్లీలోనే ముగుస్తుంది. మీరు ముంబై సెంట్రల్– మర్మగోవా – బెంగళూరు నగరం – మైసూర్ – బెంగళూరు నగరం – ఉదగమండలం – తిరువనంతపురం సెంట్రల్ ద్వారా మధుర మీదుగా కన్యాకుమారికి చేరుకుంటారు. అదే మార్గం ద్వారా న్యూఢిల్లీకి తిరిగి వస్తారు.
ఈ టిక్కెట్‌ను ఎవరు పొందవచ్చు?
ఈ టికెట్ స్లీపర్ నుంచి ఫస్ట్ క్లాస్(Sleeper to First Class Ticket) వరకు అన్ని తరగతులలో అందుబాటులో ఉంది. సర్క్యులర్ జర్నీ టికెట్లను వ్యక్తిగత ప్రయాణీకులు లేదా గ్రూపులుగా ప్రయాణించే వారు తీసుకోవచ్చు . రైల్వే నిబంధనల ప్రకారం సర్క్యులర్ జర్నీ టికెట్(Circular Journey Ticket) కింద కనీసం 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లయితే సీనియర్ సిటిజన్లు కూడా ఛార్జీ రాయితీలను పొందుతారు.
ఈ టికెట్‌ను ఎలా బుక్ చేయాలంటే..
సర్క్యులర్ జర్నీ టికెట్ల(Circular Journey Ticket)ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేరు. ప్రయాణికులు తమకు సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై మొదలైనవి) వద్ద ఉన్న రిజర్వేషన్ కౌంటర్‌కు స్వయంగా వెళ్లాలి. మీరు స్టేషన్ మాస్టర్ లేదా రిజర్వేషన్ అధికారికి ఒక దరఖాస్తు ఫారమ్ ఇవ్వాలి. అందులో మీ ప్రతిపాదిత ప్రయాణం పూర్తి వివరాలు ప్రారంభ స్టేషన్, మధ్యలోని స్టేషన్లు, చివరి గమ్యస్థానం, ప్రయాణ తేదీలు వంటి పూర్తి వివరాలు తెలియజేయాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇండియన్ రైల్వే(Indian Railways ) అధికారిక వెబ్ సైట్లో చూడవచ్చు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి