భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు..
ABN , Publish Date - Apr 18 , 2026 | 08:09 PM
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి అధికారికంగా నిరసన తెలియజేయనుంది.
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి అధికారికంగా నిరసన తెలియజేయనుంది. హోర్ముజ్ జలసంధిలో భారత జెండా ఉన్న నౌకలపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో నౌకలు, సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు (India summons Iran ambassador).
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ యూనిట్లు కాల్పులు జరపడంతో ఆ నౌకలు తమ మార్గాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆ నౌకలు ఇరాక్ నుంచి రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్నట్టు సమాచారం. కాగా, భారత నౌకలపై కాల్పుల ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌కు నిరసన తెలపనుంది. భారత్‌లోని ఇరాన్ రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ ఘటనపై టెహ్రాన్ నుంచి పూర్తి స్పష్టత కోరింది (Strait of Hormuz incident 2026).
శనివారం ఉదయం భారతదేశానికి వస్తున్న ఎనిమిది నౌకలు హోర్ముజ్ జలసంధిని సమీపించాయి (India Iran tension). ఒక నౌక సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటేసింది. ఆ తర్వాత ఐఆర్‌జీసీ కాల్పుల నేపథ్యంలో మిగిలిన ఏడు నౌకలు వెనుదిరగవలసిన పరిస్థితి తలెత్తింది. కాగా, హోర్ముజ్‌లో నెలకొన్న ఈ పరిణామాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిశితంగా పరిశీలిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..
అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు