Share News

భారత్‌కు చేరిన ఇరాన్ చమురు.. దక్షిణ తీరానికి రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్..

ABN , Publish Date - Apr 18 , 2026 | 09:33 PM

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌కు ఇరాన్ నుంచి మరోసారి చమురు సరఫరా జరుగుతోంది. ఇరాన్‌కు చెందిన డొరేనా అనే భారీ నౌక రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో భారత్ తీరానికి చేరనుంది.

భారత్‌కు చేరిన ఇరాన్ చమురు.. దక్షిణ తీరానికి రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్..
India Iran oil shipment

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌కు ఇరాన్ నుంచి మరోసారి చమురు సరఫరా జరుగుతోంది. ఇరాన్‌కు చెందిన డొరేనా అనే భారీ నౌక రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో భారత్ తీరానికి చేరనుంది. భారత దక్షిణ తీరానికి ఈ నౌక సమీపంలో ఉన్నట్టు ట్యాంకర్ ట్రాకింగ్ వ్యవస్థలు వెల్లడించాయి (India Iran oil shipment).


ఈ ట్యాంకర్ భారత్‌ సమీపానికి వచ్చినట్టు హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. భారత దక్షిణ తీరంలోని ఓ రిఫైనరీలో రెండు మిలియన్ బ్యారటెళ్ల ముడి చమురును ఈ భారీ నౌక డెలివరీ చేయనుంది. గత వారం రోజుల్లో ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చిన మూడో చమురు నౌక ఇది. దీంతో ఇరాన్ నుంచి భారత్ గత వారం రోజుల్లోనే ఆరు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసినట్టైంది (Dorena tanker India).


అమెరికా విధించిన నౌకా దిగ్బంధనం మధ్యలోనే ఈ సరఫరా జరగడం విశేషం (US blockade Iran oil). కాగా, ఆమెరికా ఆర్థిక ఆంక్షల కారణంగా 2019 తర్వాత ఇరాన్ నుంచి భారత్ క్రూడాయిల్ కొనుగోలు చేయలేదు. ఇటీవల అమెరికా ఆంక్షలు సడలించడంతో భారత్ రిఫైనరీలు ఇరాన్ నుంచి చమురను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో దాదాపు ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు చమురు సరఫరా జరిగింది.


ఇవి కూడా చదవండి..

మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..


అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు

Updated Date - Apr 18 , 2026 | 09:53 PM