Share News

ఇండియా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్‌తో భారీగా డివిడెంట్లు: యూఎన్ క్లైమేట్ చీఫ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:31 PM

గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 (జీఈసీ 3) స్కీం భారతదేశ ప్రజలతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూ భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని యూఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టీల్ అన్నారు.

ఇండియా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్‌తో భారీగా డివిడెంట్లు: యూఎన్ క్లైమేట్ చీఫ్

ఇంటర్‌నెట్ డెస్క్: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 (జీఈసీ 3) స్కీం భారతదేశ ప్రజలతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూ భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని యూఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టీల్ అన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత స్టీల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివ‌ృద్ధికి జీఈసీ 3 స్కీం అత్యంత కీలకమైన స్కీంగా ఆయన అభివర్ణించారు. ‘భారత గ్రిడ్ స్ట్రెంతెనింగ్ అండ్ బ్యాటరీ స్టోరేజీ పథకం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే కీలక పథకం. ఈ పథకంతో భారత ప్రజలతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూ మంచి డివిడెండ్లు వస్తాయి. అలాగే, భారత్‌లో పెరుగుతున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యానికి కూడా ఈ స్కీం మరింత ఉపకరిస్తుంది. ప్రజల రోజువారి ఇంధన అవసరాలు తీరడంతో పాటు భారత ఆర్థిక వ‌ృద్ధికి మరింత బూస్ట్ చేకూరుతుంది. మొత్తానికి అంత్జాతీయ సోలార్ సూపర్‌పవర్‌గా అవతరించడంలో భారత్‌కు జీఈసీ 3 స్కీం దోహదపడుతుంది’ అని స్టీల్ పేర్కొన్నారు.


పవర్ గ్రిడ్లతో మరిన్ని ఉద్యోగావకాశాలు

భారత్ వంటి భారీ ఆర్థిక వ్యవస్థగల దేశాలు ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని సాధించేందుకు జీఈసీ3 పథకం వ్యూహాత్మక అవకాశాన్ని కల్పిస్తుందని సైమన్ స్టీల్ చెప్పారు. అంతేకాకుండా బలమైన పవర్ గ్రిడ్లు, బ్యాటరీ స్టోరేజీలతో తయారీ, నిర్మాణం, ఎనర్జీ స్టోరేజీ రంగాల్లో మరిన్ని ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. కాగా.. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్‌కు స్టీల్ కార్యనిర్వాహక సెక్రటరీగా ఉన్నారు.


ఇక జీఈసీ 3 స్కీంతో 135 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సరఫరా చేయడానికి, అనుసంధానించడానికి అంతరాష్ట్ర ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, గ్రిడ్ స్థిరత్వాన్ని కొనసాగించేందుకు పునరుత్పాదక వనరుల నుంచి గ్రిడ్ ఆపరేటర్లు అప్పుడప్పుడు శక్తిని పరిమితం చేస్తుంటారు. జీఈసీ 3తో భవిష్యత్తులో శక్తిని పరిమితం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జీఈసీ 3 పథకం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1.86 లక్షల కోట్లు. అందులో అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌కు రూ.1.36 లక్షల కోట్లు, 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్‌‌కు రూ.50 వేల కోట్లు ఖర్చుపెట్టనున్నారు.


ఇవి కూడా చదవండి..

మచ్చార్‌ తెగువకు ప్రపంచం ఫిదా

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2026 | 01:45 PM