Share News

ట్రంప్ టారిఫ్‌‌ల రద్దుపై భారత్ తొలి స్పందన ఇదే..

ABN , Publish Date - Feb 21 , 2026 | 09:07 PM

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం తొలిసారి స్పందించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును, ఆ తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందనను విశ్లేషిస్తున్నట్టు వాణిజ్య శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ట్రంప్ టారిఫ్‌‌ల రద్దుపై భారత్ తొలి స్పందన ఇదే..
PM Modi with Donald Trump

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం తొలిసారి స్పందించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును, ఆ తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందనను విశ్లేషిస్తున్నట్టు వాణిజ్య శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.


'సుంకాలపై యూఎస్ సుప్రీంకోర్టు శుక్రవారంనాడు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నాం. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ కూడా మీడియా సమావేశంలో స్పందించారు. కొన్ని చర్యలను అమెరికా యంత్రాంగం ప్రకటించింది. ఈ పరిణామాలు, వాటి పర్యవసానాలు ఎలా ఉండవచ్చనే దానిపై విశ్లేషిస్తున్నాం' అని వాణిజ్య శాఖ పేర్కొంది.


కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కూడా సంతకాలు చేశారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హైస్ ప్రకటించింది. ఇండియాతో ట్రేడ్‌డీల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని కూడా ట్రంప్ ప్రకటించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించి చట్టపరమైన అంశాలను పూర్తి చేయడానికి భారత బృందం ఫిబ్రవరి 23న వాషింగ్టన్‌లో అమెరికా ప్రతినిధుల బృందంతో సమావేశం కానుంది.


ఇవి కూడా చదవండి..

ఏడాదిలోనే 26 లక్షల కోట్లు

300 బిలియన్‌ డాలర్లు.. ఏఐలో భారీగా పెట్టుబడులు

Updated Date - Feb 21 , 2026 | 09:38 PM