ఐదేళ్లలో వారందరినీ దేశం నుంచి తరిమేస్తాం.. కాంగ్రెస్ ఆ పని చేయలేదు: అమిత్ షా
ABN , Publish Date - Feb 21 , 2026 | 08:15 PM
అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే చొరబాటుదారుల ఏరివేత కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే చొరబాటుదారుల ఏరివేత కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో చొరబాటుదారులందరినీ దేశం నుంచి తరిమేస్తామని అన్నారు. శనివారం అస్సాంలోని కామ్‌రూప్‌లో పోలీస్ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో షా ప్రసంగించారు (Amit Shah in Assam).
చొరబాటుదారులను వారు ఆక్రమించిన స్థలాల నుంచి తరిమికొట్టినంత మాత్రాన సమస్య తీరిపోదని, వారు మరో చోట స్థిరపడే అవకాశం ఉందని అమిత్ షా అన్నారు. వారిని మొత్తంగా దేశం నుంచి బయటకు తరిమేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయబోదని స్పష్టం చేశారు. చొరబాటుదారులే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ అని, వారిని రక్షించాలనేదే హస్తం పార్టీ విధానమని విమర్శించారు (Illegal infiltration issue).
చొరబాటుదారుల విషయంలో కాంగ్రెస్ విధానాలే అస్సాంకు ముప్పుగా మారాయని అమిత్ షా విమర్శించారు (Amit Shah speech highlights). చొరబాటుదారులపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయాన్ని పొందుపర్చాలని సవాల్ విసిరారు. రానున్న ఐదేళ్లలో ఈశాన్య భారతంలో అస్సాం పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..
వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను: సీఎం చంద్రబాబు