భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 14 , 2026 | 09:20 PM
భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సర్వసిద్ధమైంది. శనివారం, ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరిగే జాతీయ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వరుసగా 13వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 14: భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రేపు (శనివారం) ఆగస్టు 15న జరుపుకోనుంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నేతృత్వం వహించనున్నారు. ఈ చారిత్రాత్మక కట్టడం నుంచి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. ప్రధాని హోదాలో నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి పంద్రాగస్టు ప్రసంగం చేస్తుండటం ఇది వరుసగా 13వ సారి కావడం విశేషం.
ఈ జెండా పండుగ మహోత్సవంలో, జాతీయ గీతం 'వందేమాతరం' 150 ఏళ్ల అచంచలమైన వారసత్వాన్ని స్మరించుకోవడంతో పాటు, 2047 నాటికి వికసిత భారత్ దిశగా భారతదేశాన్ని నడిపించడంలో యువ శక్తి పాత్ర, వాళ్ల ఆకాంక్షలు, కీలకమైన సహకారాన్ని కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఎర్రకోటలో జరిగే వేడుకల సందర్భంగా 'వందేమాతరం' గీతాన్ని ఆలపించడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం.
ఇవి కూడా చదవండి...
కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం
Read Latest National News And Telugu News