Share News

ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. ‘లీవ్ ఇండియా’ నోటీసుపై బాంబే హైకోర్టు స్టే

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:34 PM

బాలివుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆయనకు జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసుపై కోర్టు స్టే విధించింది.

ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. ‘లీవ్ ఇండియా’ నోటీసుపై బాంబే హైకోర్టు స్టే

ఇంటర్నెట్ డెస్క్: బాలివుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆయనకు జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసుపై కోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో తదుపరి విచారణ తేదీ నవంబర్ 1 వరకు ఇమ్రాన్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్టోబర్ 28లోగా ఇమ్రాన్ ఖాన్‌ భారత్​ విడిచి వెళ్లాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్​ఆర్​ఓఓ) నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసును బాంబే హైకోర్టులో సవాలు చేయగా ఆయనకు స్వల్ప ఊరట దక్కింది.


కాగా అమెరికా పౌరసత్వం ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ అక్టోబర్ 10న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్నారని, విదేశి పౌరుడు ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు స్పందించి ఇమ్రాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసు పంపించారు. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఈ నోటీసును కోర్టులో సవాలు చేశారు. తాను ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలిపారు. విచారణ చేపట్టిన కోర్టు నోటీసుపై స్టే విధించింది. తదుపరి విచారణ తేదీ వరకు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది.


ఈ వార్తలూ చదవండి

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు

గార్డును కొట్టి జైలు నుంచి 17 మంది ఖైదీల పరార్.. తమిళనాడులో ఘటన

Updated Date - Oct 27 , 2026 | 06:37 PM