Share News

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం

ABN , Publish Date - May 12 , 2026 | 12:00 PM

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11.40 గంటలకు గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం
Himanta Biswa Sarma sworn as Assam CM

గువాహటి: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11.40 గంటలకు గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిశ్వ శర్మతో పాటు బీజేపీ నుంచి ఇద్దరు, ఏజీపీ, బీపీఎఫ్ నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇది వరుసగా మూడోసారి కాగా, అసోం ముఖ్యమంత్రిగా శర్మ పగ్గాలు చేపట్టడం రెండోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు.


హిమంత బిశ్వ శర్మతో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, కొత్త టీమ్‌తో కలిసి పూర్తి అంకితభావంతో పటిష్టమైన, మరింత అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన అస్సాంను నిర్మిస్తామని శర్మ ప్రకటించారు. హిమంత బిశ్వ శర్మ తొలిసారి 2021లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు.


బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 126 స్థానాల్లో ఎన్డీయే 102 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 82 సీట్లు దక్కించుకోగా, భాగస్వామ్య పార్టీలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి 19 సీట్లు వచ్చాయి.


ఇవి కూడా చదవండి..

సీఎం విజయ్ మాస్ క్రేజ్.. ఆ పేజ్‌కు 4 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగిన ఫాలోవర్స్..

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే ప్రభాకర్ ఏకగ్రీవం

Updated Date - May 12 , 2026 | 12:47 PM