సీఎం విజయ్ మాస్ క్రేజ్.. ఆ పేజ్‌కు 4 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగిన ఫాలోవర్స్..
ABN , Publish Date - May 12 , 2026 | 11:41 AM
తమిళనాడు సీఎంఓ ఆఫీస్ సోషల్ మీడియా ఖాతాల డీపీలు మారాయి. ముఖ్యమంత్రి విజయ్ ఫొటోలను డీపీలుగా పెట్టారు. విజయ్ ఫొటో డీపీగా పెట్టిన గంటల్లోనే మ్యాజిక్ జరిగింది. సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ క్యూ కట్టారు.
చెన్నై, మే 12: తమిళనాట దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లో ఆయనను అభిమానించే వారు ఉన్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించింది. రెండు రోజుల క్రితం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
సోషల్ మీడియా ఖాతాలకు పెరిగిన ఫాలోవర్స్..
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తమిళనాడు సీఎంఓ ఆఫీస్ సోషల్ మీడియా ఖాతాల డీపీలు మారాయి. ముఖ్యమంత్రి విజయ్ ఫొటోలను డీపీలుగా పెట్టారు. విజయ్ ఫొటో డీపీగా పెట్టిన గంటల్లోనే మ్యాజిక్ జరిగింది. సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ క్యూ కట్టారు. తమిళనాడు సీఎంఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు మొదట 4 లక్షల ఫాలోవర్స్ ఉండేవారు. విజయ్ ఫొటో పెట్టిన తర్వాత 16 లక్షలకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఇక ఎక్స్ ఖాతాకు కూడా 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు 22 లక్షల మంది అయ్యారు.

సీఎం విజయ్ కీలక నిర్ణయం..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడవ రోజే విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్‌స్టాండ్స్‌కి 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మద్యం దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
చంచల్‌గూడా జైలు అధికారుల వినూత్న ప్రయోగం
ఈ 5 అలవాట్లు మీ విలువను తగ్గిస్తాయి