Share News

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే ప్రభాకర్ ఏకగ్రీవం

ABN , Publish Date - May 12 , 2026 | 11:36 AM

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ (JCD Prabhakar) మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే ప్రభాకర్ ఏకగ్రీవం
Tamil Nadu Speaker Prabhakar

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ (JCD Prabhakar) మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రోటెం స్పీకర్ ఎంవీ కరప్పయ్య తెలిపారు.


తొలుత ప్రభాకర్ నామినేషన్‌ను ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక జరిగింది. అనంతరం ప్రోటెం స్పీకర్‌గా తన పాత్ర ముగిసినట్టు కరుప్పయ్య ప్రకటించారు. ఆ వెంటనే సభాసాంప్రదాయం ప్రకారం స్పీకర్‌ ప్రభాకర్‌ను ఆయన చైర్ వరకూ సభానేత కేఏ సెంగోట్టియన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తోడ్కొని వెళ్లారు. ఆయనకు అభినందనలు తెలిపారు.


స్పీకర్‌గా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి తురైయూర్ టీవీకే ఎమ్మెల్యే ఎం.రవిశంకర్ ఒక్కరే నామినేషన్ వేశారని, దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రభాకర్ ప్రకటించారు. రవిశంకర్ నామినేషన్‌ను సెంగోట్టియన్ ప్రతిపాదించారు.


ఇవి కూడా చదవండి..

అన్నాడీఎంకేలో తిరుగుబాటు.. విజయ్ టీవీకేకు షణ్ముగం వర్గం మద్దతు

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్

Updated Date - May 12 , 2026 | 11:59 AM