Share News

Tamil Nadu: విషాదం.. హీలియం సిలిండర్ పేలి ఒకరి మృతి, 18 మందికి గాయాలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 10:45 AM

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీలియం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

Tamil Nadu: విషాదం.. హీలియం సిలిండర్ పేలి ఒకరి మృతి, 18 మందికి గాయాలు
Helium Cylinder Blast Tamil Nadu

తమిళనాడు: కల్లకురిచ్చి జిల్లా(Kallakurichi)లోని మనలూర్‌పేటైలో తెన్‌పెన్నై నదీ ఉత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెలూన్లలో గ్యాస్ నింపడానికి ఉంచిన ఓ హీలియం సిలిండర్(Helium Cylinder) పేలడంతో ఒకరు మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని తిరువణ్నామలై జిల్లా కలెక్టర్ తర్పగరాజ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు వైద్యులు వెల్లడించారు.


ప్రమాదానికి కారణమైన సిలిండర్ చిన్నదే అయినా.. ఒక్కసారిగా పేలడంతో అక్కడివారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారని స్థానికులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సిలిండర్ పేలిన ప్రదేశంలో ఫోరెన్సిక్ అధికారుల సాయంతో దర్యాప్తు చేపట్టారు. సిలిండర్‌లో పీడనం ఎక్కువ కావడంవల్లే ప్రమాదానికి కారణమైన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest National News

Updated Date - Jan 20 , 2026 | 11:10 AM