Share News

భారత నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:37 PM

భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు.

భారత నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్
General Dhiraj Seth

ఢిల్లీ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ (General Dhiraj Seth) ఈరోజు (మంగళవారం) బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా (COAS) ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు. ఆర్మోర్డ్ కార్ప్స్ (ట్యాంక్ రెజిమెంట్) విభాగం నుంచి ఆర్మీ చీఫ్ పదవిని అధిష్ఠించిన 7వ అధికారిగా ధీరజ్ సేథ్ రికార్డు సృష్టించారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో సైనిక సంప్రదాయాల మధ్య అధికారికంగా కొత్త ఆర్మీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఆర్మోర్డ్ కార్ప్స్‌లో (2nd Lancers) కమిషన్డ్ అధికారిగా జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్థానం ప్రారంభించారు.


జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. సైన్యంలో కీలకమైన సదరన్ కమాండ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్.. రెండింటికీ ఆర్మీ కమాండర్‌గా ధీరజ్ సేథ్ వ్యవహరించారు. రక్షణ విభాగంలో ప్లానింగ్, కేపబిలిటీ డెవలప్‌మెంట్‌లో విశేష అనుభవం.. సైన్యం ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 02:15 PM