Share News

విదేశీ పౌరుడ్ని ఏకపక్షంగా బహిష్కరించలేం.. స్వదేశం అనుమతిస్తేనే పంపగలం: కేంద్రం

ABN , Publish Date - Aug 02 , 2026 | 08:10 AM

విదేశీ పౌరుడ్ని ఏకపక్షంగా స్వదేశానికి పంపడం (డీపోర్టేషన్‌) కుదరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తి జాతీయతను ఆయా దేశం గుర్తించి, అతడు/ఆమెను వచ్చేందుకు అనుమతిస్తేనే, వెనక్కి పంపాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో తెలియజేసింది.

విదేశీ పౌరుడ్ని ఏకపక్షంగా బహిష్కరించలేం.. స్వదేశం అనుమతిస్తేనే పంపగలం: కేంద్రం

న్యూఢిల్లీ: విదేశీ పౌరుడ్ని ఏకపక్షంగా స్వదేశానికి పంపడం (డీపోర్టేషన్‌) కుదరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తి జాతీయతను ఆయా దేశం గుర్తించి, అతడు/ఆమెను వచ్చేందుకు అనుమతిస్తేనే, వెనక్కి పంపాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో తెలియజేసింది. విదేశీ పౌరులను వారి స్వదేశాలకు పంపించేయకుండా, అసోం రాష్ట్రంలో నిరవధికంగా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ రాజుబాల దాస్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాససం విచారణ నిర్వహించింది.


కోర్టు నోటీసుకు స్పందనగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన వివరణను తెలియజేసింది. పౌరసత్వం నిర్ధారణ కాకుండా, దేశ బహిష్కరణ ప్రక్రియను మొదలు పెట్టలేమని స్పష్టం చేసింది. చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రం లేదా పాస్‌పోర్ట్‌ ఉండి, కోర్టు విచారణ లేదా శిక్ష పూర్తయిన విదేశీ పౌరుడు/పౌరురాలిని.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విదేశీయుల ప్రాంతీయ నమోదు కేంద్రం ప్రస్తుతం అమల్లో చట్టాల కింద దేశం నుంచి పంపించేయొచ్చని వెల్లడించింది.


అయితే, విదేశీ పౌరుల జాతీయత గుర్తింపు తేలి, ఎలాంటి ప్రయాణ పత్రం లేని సందర్భాల్లో.. ఆయా దేశానికి చెందిన ఎంబసీ లేదా హైకమిషన్‌ ద్వారా దాన్ని పొందడం తప్పనసరి అని పేర్కొంది. విదేశీ సహకారంతోనే ఒక వ్యక్తి దేశ బహిష్కరణ సాధ్యపడుతుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు వారు జాతీయ భద్రత దృష్ట్యా వారి కదలికలను నియంత్రించడం మినహా మార్గం లేదని తేల్చిచెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగాల్‌లో ఉగ్రకుట్ర భగ్నం

ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలవుతున్నారు!

For More National News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 08:16 AM