Share News

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. జనవరిలో మోగనున్న నగారా!

ABN , Publish Date - Nov 09 , 2026 | 06:48 PM

దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కసరత్తు చేపట్టింది. జనవరి మాసం ప్రథమ, ద్వితీయార్థంలో ఈ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. జనవరిలో మోగనున్న నగారా!

ఢిల్లీ, నవంబర్ 09: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కసరత్తు చేపట్టింది. జనవరి మాసం ప్రథమ, ద్వితీయార్థంలో ఈ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి - మార్చి మాసాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రయత్నిస్తోంది.


ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్(SIR), ఈవీఎంల తనిఖీలను ఎన్నికల సంఘం (ఈసీ) వేగవంతం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందే ఈ రాష్ట్రాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ సంకేతాలతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.


అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఇక పంజాబ్‌లో మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.


ఈ ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మరో వైపు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 సీట్లపైనే అందరి దృష్టి ఉంది. ఈ ఫలితాలు దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలను శాసిస్తాయనే చర్చ సాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 06:56 PM