పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Oct 02 , 2026 | 10:37 AM
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి జిల్లా ధమన్‌గావ్ సమీపంలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే చానెల్ 97పై కొంతమంది ప్రయాణికులతో ఓ పికప్ వ్యాన్ అర్ధరాత్రి 12.45 నిమిషాలకు వెళుతోంది. ఆ టైంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు.. పికప్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాధితులను ముందుగా ధమన్‌గావ్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం వార్ధా మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గాదేవి విగ్రహాన్ని కొని వెళ్తుండగా..
ప్రమాదానికి గురైన పికప్ వ్యాన్‌లోని ప్రయాణికులు.. రాబోయే దసరా నవరాత్రి పండుగ వేడుకల కోసం మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షెగావ్‌కు వెళ్లారు. అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని కొనుగోలు చేసి, పికప్ వ్యాన్‌లో తిరిగి బయల్దేరారు. వ్యాన్ వార్ధా వైపు వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగింది. అయితే, గాయపడిన 21 మందిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పికప్ వ్యాన్‌ను ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. వ్యాన్‌లోని భక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే వ్యాన్‌ను ఢీకొట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..