Share News

శ్రీనగర్‌ మసీదులో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - Apr 10 , 2026 | 08:35 PM

శ్రీనగర్‌లోని హైదర్‌పొరా ప్రాంతంలో ఉన్న జామియా అరేబియా అష్రాఫుల్ ఉలూమ్‌/దారుల్ ఉలూమ్ సెమినరీలో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ మూడో అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుని పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

శ్రీనగర్‌ మసీదులో భారీ అగ్నిప్రమాదం
Srinagar Jamia Arabia

శ్రీనగర్: శ్రీనగర్‌లోని హైదర్‌పొరా ప్రాంతంలో ఉన్న జామియా అరేబియా అష్రాఫుల్ ఉలూమ్‌/దారుల్ ఉలూమ్ సెమినరీలో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ మూడో అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుని పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. స్థానికులు కూడా అక్కడకు చేరుకుని మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు కానీ, గాయపడినట్టు కానీ వెంటనే సమాచారం లేదు. ప్రమాదానికి కారణాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయులు.. కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు

లెబనాన్‌‌పై దాడులు.. పెద్దఎత్తున పౌరుల మరణాలపై భారత్ ఆందోళన

Updated Date - Apr 10 , 2026 | 08:37 PM