నీట్ పేపర్ లీక్ కేసు.. రంగంలోకి ఈడీ
ABN , Publish Date - Aug 31 , 2026 | 10:57 AM
నీట్ యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రారంభించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా ఈ దర్యాప్తు చేపట్టింది. ఈ పేపర్ లీక్ కేసు వ్యవహారంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ, ఆగస్టు31: నీట్ యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రారంభించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ పేపర్ లీక్ కేసు వ్యవహారంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో అక్రమ లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
నీట్ పేపర్ విక్రయాల ద్వారా చేతులు మారిన నగదు, హవాలా లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితులు పేపర్ లీక్ సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులు, బినామీ ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. ఈ కేసులో 13 మంది నిందితులకు సంబంధించిన ఛార్జిషీట్ వివరాలు, సాక్షుల వాంగ్మూలాలతోపాటు కీలక పత్రాలను ఈడీకి సీబీఐ అందజేసింది. సీబీఐ, ఈడీల సంయుక్త విచారణతో నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రమేయమున్న వ్యక్తులపై ఉచ్చు బిగుస్తోంది.
స్పందించిన ఈడీ..
సీబీఐ అందించిన సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నామని ఈడీ అధికారులు వివరించారు. ఈ పేపర్ లీక్ వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్న సీబీఐ కోర్టు విచారణలు ముగిసే వరకు తాము వేచి ఉంటామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. నిందితుల అరెస్ట్
ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురి మృతి
For More National News And Telugu News