ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:23 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహాలో మరో ఘటన జరిగింది. అయితే ఈ దారుణం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహాలో మరో ఘటన జరిగింది. అయితే ఈ దారుణం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కశ్మీర్ గేట్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేట్ బస్సులో బాలికపై సామూహిక అత్యాచారానికి కండక్టర్, డ్రైవర్ పాల్పడ్డారు. ఆగస్టు 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్ చేశారు. ఈ బస్సును సీజ్ చేశారు. బాధితురాలి స్వస్థలం.. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా అని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం..
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పుర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక.. కుటుంబ సభ్యులతో ఘర్షణ పడింది. అనంతరం వారికి చెప్పకుండా.. న్యూఢిల్లీ సమీపంలోని నోయిడాలో తన బంధువు ఇంటికి బయలుదేరింది. అయితే భారీ వర్షం, చీకటి కావడంతో.. పొరపాటున పరి చౌక్ వద్ద బస్సు దిగింది. మరో బస్సు కోసం ఆమె ఎదురు చూడసాగింది. ఇంతలో స్లీపర్ బస్సు అటు వైపు వచ్చింది.
ఈ బస్సు నోయిడా వైపు వెళ్తాందా? అని కండక్టర్‌ను అడిగింది. అతడు అవునని సమాధానం ఇవ్వడంతో.. ఆమె బస్సు ఎక్కింది. దీంతో ఆ బస్సులో ఆమెపై కండక్టర్, డ్రైవర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి కశ్మీర్‌గేట్ వద్దనున్న రింగ్ రోడ్డు సమీపంలో ఆమెను నిందితులు వదిలి పారిపోయారు.
దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ బస్సును తిమర్‌పూర్ వద్ద పోలీసులు అడ్డగించి.. నిందితులను అరెస్ట్ చేశారు. ఆ బాలికను ఎక్కించుకుని దాదాపు 47 కిలోమీటర్ల మేర ఈ బస్సు ప్రయాణించి.. మళ్లీ కశ్మీర్ గేట్ చేరుకుందని పోలీసులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్ కేసు.. రంగంలోకి ఈడీ
ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురి మృతి
For More National News And Telugu News