Share News

ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్.. ఈసీ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:26 PM

ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే.. ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. వివరాల్లోకి వెళితే..

ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్.. ఈసీ కీలక ఆదేశాలు
Election Commission of India

ఢిల్లీ, అక్టోబర్ 2: ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే.. ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. SIR ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన వర్గాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇందులో భాగంగా తొలిసారి ఓటు హక్కు పొందనున్న యువతతో పాటు గతంలో ఓటర్ల జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం కనిపించని వారు.. ఇప్పటివరకూ ఓటరుగా నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులను గుర్తించనున్నారు. ఈ ప్రక్రియలో పాత ఓటర్ల వివరాలను పరిశీలించడంతో పాటు కొత్తగా అర్హత సాధించిన వారిని కూడా జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ECI స్పష్టం చేసింది. దీంతో ఓటర్ల జాబితాలో అర్హులైన వారి వివరాలు తప్పకుండా ఉండేలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు.


ఈ ప్రత్యేక కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు (BLO) కీలక పాత్ర పోషించనున్నారు. వారు నేరుగా ఇళ్లకు వెళ్లి అర్హులైన వారిని గుర్తించి.. అవసరమైన వారికి ఫారమ్-6 దరఖాస్తులు పూర్తి చేయించనున్నారు. ప్రతి వారం కనీసం 20 నుంచి 25 మంది అర్హులను పరిశీలించేలా BLOలకు సూచనలు జారీ చేశారు. ప్రక్రియలో పారదర్శకత కోసం BLOలు సిద్ధం చేసే జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) అందించాలని ECI ఆదేశించింది. మరోవైపు నిరాశ్రయులు, కార్మిక కాలనీలు, అంచున ఉన్న వర్గాలు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బూత్ స్థాయి శిబిరాలు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా చర్యలు చేపట్టనున్నారు.


ఇవి కూడా చదవండి...

నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల

ఏపీ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుపై మంత్రి సంధ్యారాణి హర్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 01:11 PM