Share News

మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో డ్రోన్ కలకలం

ABN , Publish Date - Apr 04 , 2026 | 07:45 PM

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో ఒక డ్రోన్ కనిపించడం సంచలనమైంది. మాల్దాలోని మాలతీపూర్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని గజోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కబోతుండగా సమీపం నుంచి ఒక డ్రోన్ అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించింది.

మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో డ్రోన్ కలకలం
Mamata Banerjee

మాల్దా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) హెలికాప్టర్ సమీపంలో ఒక డ్రోన్ కనిపించడం సంచలనమైంది. మాల్దాలోని మాలతీపూర్‌లో శనివారంనాడు ఎన్నికల ప్రచారం ముగించుకుని గజోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కబోతుండగా సమీపం నుంచి ఒక డ్రోన్ అనుమానాస్పదంగా గాలిలో ఎగురుతూ కనిపించింది. దీంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యాయి. తక్షణ దర్యాప్తు ప్రాంభించి ముగ్గురిని అరెస్టు చేశారు. మమత హెలికాప్టర్‌కు దగ్గర్లో డ్రోన్ కనిపించిన వీడియా ప్రస్తుతం వైరల్ అవుతోంది.


దీనికి ముందు, మాల్దాలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం సాగించారు. బెంగాల్ ఎస్ఐఆర్ డ్రైవ్‌కు సంబంధించి బీజేపీ, కేంద్ర హోం మంత్రిపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎవరి పేర్లయితే ఓటర్ల జాబితా నుంచి తొలిగించారో వారికి బీజేపీ క్షమాపణలు చెప్పాలన్నారు. మాల్దాలో జరిగిన హింస, న్యాయాధికారుల ఘెరావ్ ఘటనపై మాట్లాడుతూ, అమాయక ప్రజలను ఎన్ఐఏ అదుపులోనికి తీసుకుని వేధిస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు.


బీజేపీ ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా ప్రజలు ఓపికగా ఉండాలని, బీజేపీ హింసను రెచ్చగొట్టి, సెంట్రల్ ఏజెన్సీల ద్వారా అమాయకులను అదుపులో తీసుకుంటుందని హెచ్చరించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరుగనున్నాయి. మే 4న కౌంటింగ్ జరుగుతుంది.


ఇవి కూడా చదవండి..

కేరళలో ఎల్‌డీఎఫ్‌కు ఉద్వాసన, బీజేపీ విజయం ఖాయం: మోదీ

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 04 , 2026 | 07:48 PM