Share News

స్వాతంత్ర్య వేడుకల్లో త్రిషకు విజయ్ సెల్యూట్.. డీఎంకే పత్రిక విమర్శలు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:31 PM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. ఆగస్టు 15న చెన్నైలోని ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడం, ఆమెకు విజయ్‌ సెల్యూట్‌ చేయడం చర్చనీయాంశంగా మారాయి.

స్వాతంత్ర్య వేడుకల్లో త్రిషకు విజయ్ సెల్యూట్.. డీఎంకే పత్రిక విమర్శలు..
Vijay, Trisha

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. ఆగస్టు 15న చెన్నైలోని ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడం, ఆమెకు విజయ్‌ సెల్యూట్‌ చేయడం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా డీఎంకే అధికార పత్రిక 'మురసోలి' తన సంపాదకీయంలో ఈ అంశంపై విజయ్‌ను తీవ్రంగా విమర్శించింది (Vijay Trisha Independence Day Event).


స్వాతంత్ర్య వేడుకల్లో విజయ్‌ తల్లిదండ్రుల పక్కన, ముందు వరుసలో త్రిష కూర్చున్నారు. విజయ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అధికారిక కార్యక్రమాలను పరిశీలిస్తున్న సమయంలో త్రిష ఆయనకు సెల్యూట్‌ చేశారు. విజయ్‌ కూడా ముందు వరుసలో ఉన్న త్రిషకు అభివాదం చేస్తూ సెల్యూట్‌ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను ప్రస్తావిస్తూ విజయ్‌ తీరును 'మురసోలి' తీవ్రంగా తప్పుబట్టింది (DMK Murasoli).


ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఓ నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెకు పలుమార్లు సెల్యూట్‌ చేయడం సముచితం కాదంటూ విమర్శించింది (Vijay Trisha News). విజయ్ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. 'స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రి విజయ్ హుందాతనం గాలిలో కలిసిపోయింది. ఏమాత్రం సిగ్గు, సంకోచం లేకుండా ఆయన ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టారు. పదేపదే ఒకరికొకరు వందనాలు చేసుకున్నారు. ఆయనకు ఓటు వేసిన వారు సైతం ఈ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయారు' అని 'మురసోలి' పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..

Updated Date - Aug 18 , 2026 | 01:52 PM