Share News

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:28 AM

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్‌ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..
Odisha Businessman Kidnapping

ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్‌ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు (Odisha Businessman Kidnapping).


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14న నరేంద్ర సాహును తుపాకీతో బెదిరించి బొలాంగీర్‌ నుంచి భువనేశ్వర్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఓ హోటల్‌లో ఆయనను నిర్బంధించి కొట్టారు. తుపాకీతో బెదిరించారు. నరేంద్ర సాహు మరో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్లు చూపిస్తూ ఆ వీడియోను ఉపయోగించి ఆయనను బ్లాక్‌మెయిల్‌ చేయాలనేది నిందితుల ఉద్దేశం. నరేంద్ర కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. నరేంద్రను తీసుకెళ్లిన వాహనం భువనేశ్వర్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్‌ చేశాయి (Odisha Crime News).


ఈ కేసులో క్షితీష్‌ చంద్ర సాహు, సంజీవ్‌ బెహెరా ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు (Kidnapping Case). క్షితీష్‌ సోదరి స్నేహమంజరి సాహు ఖండగిరి పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కూడా కిడ్నాప్‌ కుట్రలో భాగమైనట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అలాగే భువనేశ్వర్‌కు చెందిన జర్నలిస్టు సంజయ్‌ జెనా పోలీస్‌ అధికారిగా నటిస్తూ నరేంద్రను ఖండగిరి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన.. దిమాగీ నక్సల్‌ పార్టీ

శివాలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

Updated Date - Aug 18 , 2026 | 07:28 AM