Share News

శివాలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:11 AM

శ్రావణ సోమవారం వేళ బిహార్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. లఖిసరాయ్‌ జిల్లాలోని అశోక్‌ధామ్‌ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన...

శివాలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

  • 14 మందికి తీవ్రగాయాలు

  • శ్రావణ సోమవారం, నాగపంచమి కావడంతో

  • బిహార్‌లోని అశోక్‌ధామ్‌ గుడికి పోటెత్తిన జనం

  • మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం

  • బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌదరి ప్రకటన

  • ఉజ్జయినిలోనూ తోపులాట.. 13మందికి గాయాలు

లఖిసరాయ్‌, ఆగస్టు 17: శ్రావణ సోమవారం వేళ బిహార్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. లఖిసరాయ్‌ జిల్లాలోని అశోక్‌ధామ్‌ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి ఒకే రోజు రావడంతో పరమశివుడికి జలాభిషేకం చేసేందుకు ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారని అధికారులు తెలిపారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భారీ జనసందోహం కారణంగా బారికేడ్లు విరిగి భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో ప్రమాదం జరిగిందని వివరించారు. బిహార్‌ సీఎం సామ్రాట్‌ చౌదరి మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.

ఉజ్జయినిలోనూ తొక్కిసలాట

శ్రావణ సోమవారం, నాగుల చవితి పర్వదినాలు పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. హరిసిద్ధి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల నుంచి కరెంట్‌ షాక్‌ వస్తోందంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లోని తారాపీఠ్‌లో కాళీ ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగి ఎనిమిది మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 07:11 AM