Share News

రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన.. దిమాగీ నక్సల్‌ పార్టీ

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:32 AM

‘సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించాం. దిమాగీ నక్సల్స్‌ మాత్రం మిగిలారు’ అంటూ ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మోదీ...

రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన.. దిమాగీ నక్సల్‌ పార్టీ

  • మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో తెరపైకి

  • 24 గంటల్లోనే ఇన్‌స్టాలో

  • 2.6 లక్షల ఫాలోవర్లు..

  • అవును.. మేం దిమాగీ నక్సల్స్‌మే

  • చిదంబరం, కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు

  • విపక్షాలు, కాంగ్రెస్‌ తీరుపై బీజేపీ ధ్వజం

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ‘సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించాం. దిమాగీ నక్సల్స్‌ మాత్రం మిగిలారు’ అంటూ ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మోదీ ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే దిమాగీ నక్సల్‌ అనే పేరిట ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌లో తెరిచిన పార్టీ ఖాతాలకు అనూహ్య ఆదరణ లభించింది. ఇన్‌స్టాలో 1.81 లక్షల మంది, ఎక్స్‌లో 7వేలమంది ఆ ఖాతాలను అనుసరించారు. ఇన్‌స్టాలో ‘దిమాగీ నక్సల్‌ పార్టీ’ అని, ఎక్స్‌లో ‘దిమాగీ నక్సల్‌ జనతా పార్టీ’ అని ఖాతాలు తెరిచారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు ‘ఓ దిమాగీ ఇండియన్‌’ అని చెప్పుకొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఎప్పుడు సృష్టించారనేది స్పష్టత లేదుగానీ ‘ఎక్స్‌’ ఖాతాను మాత్రం ఈ నెలలోనే తెరిచారు. మరోవైపు, మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ‘‘ఆయన తన రాజకీయ ప్రత్యర్థులను తొలుత ‘అర్బన్‌ నక్సల్స్‌’ అన్నారు. ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్‌’ అని అంటున్నారు. మోదీలోని నిరాశానిస్పృహలను ఈ పదం తెలియ జేస్తోంది’’ అని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో విమర్శించారు. అవును.. నేను దిమాగీ నక్సల్‌నేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. నిజమైన దేశభక్తునిగా బీజేపీకి లొంగబోనని, దిమాగీ నక్సల్‌గా ఉండేందుకు గర్విస్తానని ‘ఆప్‌’ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, విద్యా సంస్కరణల కోసం ఉద్యమిస్తున్న జన్‌ జీ యువతకు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ మద్దతు ప్రకటించారు. ‘‘విద్యా వ్యవస్థలో కుంభకోణం జరిగిందనేది అంగీకరించి బాఽధ్యులను శిక్షించండి. లేదంటే పోరాటంలోకి నేను కూడా దిగుతా’’నని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 06:53 AM