భవిష్యత్తులో స్థానం కల్పిస్తాం.. కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్
ABN , Publish Date - Aug 03 , 2026 | 07:52 PM
కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ అసంతృప్త నేతలకు కీలక సందేశం ఇచ్చారు. శాసనసభ్యులందరినీ ఒకేసారి మంత్రివర్గంలోకి తీసుకోవడం సాధ్యం కాదని, భవిష్యత్తులో తప్పకుండా ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు.
బెంగళూరు, ఆగస్టు 3: కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ అసంతృప్త నేతలకు కీలక సందేశం ఇచ్చారు. శాసనసభ్యులందరినీ ఒకేసారి మంత్రివర్గంలోకి తీసుకోవడం సాధ్యం కాదని, ఇప్పుడు అవకాశం రాని నాయకులకు భవిష్యత్తులో తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు.
గతాన్ని గుర్తుచేసుకున్న సీఎం
'మన వద్ద చాలామంది సమర్థులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందరినీ ఒకేసారి కేబినెట్‌లోకి తీసుకోవడం సాధ్యపడదు. గతంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో నాకు కూడా అవకాశం దక్కలేదు. కానీ ఆ తర్వాత నేను మంత్రిని అయ్యాను కదా? అదే రీతిలో ఇప్పుడు పదవులు రాని వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తాం. అందరూ ఓపికగా ఉండాలని కోరుతున్నాను' అని శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
20 మంది నూతన మంత్రులు: కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతో ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ తన కేబినెట్‌లోకి 20 మంది నేతలను చేర్చుకున్నారు. ఇందులో 12 మంది కొత్త ముఖాలకు అవకాశం దక్కగా, 8 మంది మునుపటి మంత్రులను తిరిగి కొనసాగించారు. ఈ జాబితాలో గాయత్రి శాంతెగౌడ ఏకైక మహిళా మంత్రిగా చోటు దక్కించుకున్నారు.
శాసనసభ, మండలి కొత్త అధిపతులు:
మంత్రివర్గంతో పాటు శాసనసభ, శాసనమండలి ప్రాధాన్య పదవుల నియామకాలకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ విస్తరణతో కర్ణాటక ప్రభుత్వంలో సీఎం శివకుమార్‌తో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య రాజ్యాంగబద్ధమైన గరిష్ఠ పరిమితి అయిన 34కు చేరింది.
వార్తలు కూడా చదవండి...
కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు
డ్రగ్స్ రహిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News