బయట నుంచి చూస్తే సంఘ్‌ను అర్థం చేసుకోలేరు: మోహన్ భాగవత్
ABN , Publish Date - Jun 13 , 2026 | 09:27 PM
రాష్ట్రీయ స్యయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, అయితే అత్యంత అపార్థానికి గురవుతున్న సంస్థ కూడా ఇదేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
తిరువనంతపురం: రాష్ట్రీయ స్యయం సేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, అయితే అత్యంత అపార్థానికి గురవుతున్న సంస్థ కూడా ఇదేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. స్వయం సేవకులు యూనిఫాంలో రూట్‌మర్చ్‌లు చేయడం, కర్రలతో ఎక్సర్‌సైజులు చేయడం చూసి పారామిలటరీ సంస్థ అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటేనని అన్నారు. సంఘ్‌ను బయట నుంచి చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేరళంలోని తిరువనంతపురంలో శనివారంనాడు జరిగిన ప్రబుద్ధ పౌర సంఘం (ప్రముఖ్ నాగరిక్ సంఘోస్టి) కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడారు.
'ఆర్ఎస్ఎస్‌ను బయట నుంచి చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా దానిని లోతుగా అర్థం చేసుకోవచ్చు. సంఘ్ గురించి విశ్వసనీయ వనరుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే సంఘ్ గురించి తెలుస్తుందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ ఒక ప్రత్యేక సందర్భం గురించి స్పందించే సంస్థ కాదని, అలాగే సమాజంలోని ఏ వర్గాన్ని కానీ, రాజకీయ పార్టీని కానీ వ్యతిరేకించే సంస్థ కూడా కాదని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్‌ను చెబుతున్నప్పటికీ అత్యంత అపార్ధానికి గురవుతున్న సంస్థ కూడా ఇదేనని అన్నారు. ఈ అపోహలు తొలగించేందుకే ఆర్ఎస్ఎస్ పాత్ర, మిషన్ గురించి వివరించాల్సిన అవసరం ఏర్పడిందని భాగవత్ చెప్పారు. సమాజ సంక్షేమం, దేశ సేవ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని, ఆ కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్ వైఖరిని నిలదీసిన సీపీఎం
మరోసారి నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..