Share News

భారత సైన్యానికి కొత్త అధిపతి.. తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:31 PM

ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత సైన్యానికి కొత్త అధిపతి.. తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
Lt Gen Dhiraj Seth

ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా (VCOAS) బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ (Lt Gen Dhiraj Seth)ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS)గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు (Next Indian Army Chief).


ధీరజ్ సేథ్ జూన్ 30 మధ్యాహ్నం నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం 2028 ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఖడక్వాస్లా పూర్వ విద్యార్థి అయిన ధీరజ్ సేథ్ 1986లో భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో వివిధ హోదాల్లో పని చేశారు (Army Chief Appointment).


ధీరజ్ సేథ్ దక్షిణ కమాండ్, దక్షిణ పశ్చిమ కమాండ్‌లకు సారథ్యం వహించడంతో పాటు, ఆర్మీ ప్రధాన కార్యాలయంలోనూ కీలక పదవులు చేపట్టారు. సైన్యంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు పరమ్ విశిష్ట సేవా మెడల్ (PVSM), ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్ (UYSM), అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.


ఇవి కూడా చదవండి..

అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..


మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..

Updated Date - Jun 13 , 2026 | 06:38 PM