Share News

వర్క్ ఫ్రమ్ బైక్.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:46 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ నడుపుతూనే ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్నాడు. ఈ ప్రమాదకర దృశ్యాన్ని చూసిన చాలామంది రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ బైక్.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..
man working on laptop while riding bike

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ నడుపుతూనే ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్నాడు. ఈ ప్రమాదకర దృశ్యాన్ని చూసిన చాలామంది రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. @NishadIndra1 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (Man working on laptop while riding bike).


ఆ వీడియోలో ఓ యువకుడు బైక్‌ను నడుపుతూనే ల్యాప్‌టాప్‌ను తెరిచి పెట్టుకుని చూస్తున్నాడు. బైక్ వేగం కూడా సాధారణంగానే ఉంది. అలాగే ఆ రహదారిపై చాలా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ వీడియో తీసిన వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'కొద్ది నిమిషాల పని కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం సరైనదేనా?' అంటూ ప్రశ్నించారు. పని ఒత్తిడి, కెరీర్ పోటీ కారణంగా చాలామంది తమ భద్రతను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు (Work from bike).


ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది (Laptop on bike). ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులను మానుకోవాలని హితవు పలికారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..


మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..

Updated Date - Jun 13 , 2026 | 04:46 PM