Share News

మరోసారి నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..

ABN , Publish Date - Jun 13 , 2026 | 08:34 PM

దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను మరోసారి ఆందోళనకు గురిచేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను కేంద్రం ఖండించింది. నీట్ ప్రశ్నపత్రం మరోసారి లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

మరోసారి నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..
NEET paper leak PIB Fact Check

దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను మరోసారి ఆందోళనకు గురిచేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను కేంద్రం ఖండించింది. నీట్ ప్రశ్నపత్రం మరోసారి లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది (NEET paper leak).


రీ-నీట్ ప్రశ్నపత్రంగా పేర్కొంటూ కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check).. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కంటెంట్‌కు ఎలాంటి ప్రామాణికతా లేదని పేర్కొంది. అభ్యర్థులు ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దని, పరీక్షలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.


ఇక జూన్ 21న జరగనున్న రీ-నీట్ పరీక్ష కోసం ఎన్‌టీఏ కఠిన భద్రతా చర్యలు చేపట్టింది (NEET re-exam). ప్రశ్నపత్రాల తయారీ నుంచి పంపిణీ వరకు బహుళస్థాయి పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తోంది. అలాగే రీ-నీట్‌కు సంబంధించిన నియమావళిలో ఎన్‌టీఏ పలు మార్పులు కూడా చేసింది. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పొడిగించింది. జూన్ 21 మధ్యాహ్నం 2 నుంచి 5:15 గంటల వరకు పరీక్ష జరగనుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..


మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..

Updated Date - Jun 13 , 2026 | 08:36 PM