Dera Baba Parole: డేరా బాబాకు 40 రోజుల పెరోల్
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:33 PM
డేరాబాబా 2017 ఆగస్టులో దోషిగా నిరూపణ అయినప్పటి నుంచి పెరోల్‌పై జైలు బయటకు రావడం ఇది 15వ సారి. గత ఏడాది ఆగస్టులో కూడా ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరైంది.
ఛండీగఢ్: ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష పడిన డేరా సచ్ఛా సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahum Singh)కు ఆదివారంనాడు మరోసారి హర్యానా ప్రభుత్వం 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో సునరయి జైలులో ప్రస్తుతం ఆయన శిక్ష అనుభవిస్తున్నారు.
డేరాబాబా 2017 ఆగస్టులో దోషిగా నిరూపణ అయినప్పటి నుంచి పెరోల్‌పై జైలు బయటకు రావడం ఇది 15వ సారి. గత ఏడాది ఆగస్టులో కూడా ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరైంది. పదహారేళ్ల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులోనూ డేరాబాబా, మరో ముగ్గురిని కోర్టు దోషులుగా తీర్పుచెప్పింది. కాగా, గత జనవరిలో 30 రోజులు, ఏప్రిల్‌లో 21 రోజులు ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. 2024 అక్టోబర్ 5న హర్యనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 1న 20 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చారు. 2024 ఆగస్టులోనూ 21 రోజుల పెరోల్ లభించింది. దానికి ముందు 2022 ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలకు ముందు కూడా మూడు వారాలపాటు ఆయన జైలు బయటకు వచ్చారు.
డేరా బాబాకు తరచు పెరోల్, సెలవులు మంజురు చేయడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీతో సహా పలు సిక్కు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో పలుమార్లు విడుదలైన సమయంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోని డేరా భగత్ ఆశ్రమంలోనే ఆయన బస చేసేవారు. సిర్సాకు చెందిన డేరా సచ్ఛా సౌదాకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది.
ఇవి కూాడా చదవండి..
బలవంతుడిదే రాజ్యం... వెనెజువెలాలో అమెరికా సైనిక చర్యపై శశిథరూర్
నికోలస్ మదురో సత్యసాయి భక్తుడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి