Vande Bharat: వందేభారత్ స్లీపర్ ట్రైన్ లోపల ఎలా ఉందో చూశారా.. వీడియో..
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:15 PM
వందే భారత్ స్లీపర్ ట్రైన్లు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలు కోల్‌కతా-గువాహటి మధ్య నడవనుంది. 16 బోగీలున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..
న్యూఢిల్లీ: వందే భారత్ స్లీపర్ ట్రైన్లు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలు కోల్‌కతా-గువాహటి మధ్య నడవనుంది. 16 బోగీలున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ ట్రైన్‌లో ఉండే సౌకర్యాలను వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. కొత్త తరం వందే భారత్ స్లీపర్ ట్రైన్లలో ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగ్గా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ ట్రైన్‌లో విస్తృత ట్రే హోల్డర్లు, సర్దుబాటు చేయదగిన విండో షేడ్లు, రీడింగ్ లైట్లు, హ్యాంగర్లు, మ్యాగజైన్ హోల్డర్లు, నీరు బయటకు రాకుండా ఉండే డీప్ వాష్ బేసిన్లు వంటి సౌకర్యాలు అందించడం జరిగింది. దాంతోపాటు అంధ ప్రయాణికుల సౌలభ్యం కోసం సీట్ల సంఖ్యలను బ్రెయిలీ లిపిలో లేబుల్ చేశారు.
అంతేకాదు, ఈ ట్రైన్‌లో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎర్గోనామిక్‌గా రూపొందించిన కుషనింగ్ బెర్త్‌లు, ఆటోమేటిక్ తలుపులు, హై-లెవెల్ సస్పెన్షన్, తక్కువ శబ్దం.. ఇలా ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవచ్), ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్, పెస్ట్ కంట్రోల్ టెక్నాలజీ వంటి భద్రతా, పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఇటీవల రైల్వే భద్రతా కమిషనర్ పర్యవేక్షణలో హై-స్పీడ్ ట్రయల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. ఈ ట్రయల్స్ విజయవంతంగా ముగిసిందని.. త్వరలోనే కోల్‌కతా-గువాహటి మధ్య ఈ ట్రైన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ట్రయల్ సమయంలో రైడ్ స్టెబిలిటీ, డోలనం, వైబ్రేషన్, బ్రేకింగ్ పనితీరు, అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్‌లు, భద్రతా వ్యవస్థలు వంటి కీలక సాంకేతిక అంశాలను పరిశీలించారు.
చార్జీలు:
3 AC – రూ.2,300 వరకు ఉంటుంది.
2 AC – రూ.3,000 వరకు ఉంటుంది.
1 AC – రూ.3,600 వరకు ఉంటుంది.
ఈ చార్జీలలో భోజనం సౌకర్యం కూడా ఉంటుంది. ఈ చార్జీలను మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ట్రైన్‌లో 3 AC 11 కోచ్‌లు, 2 AC 4 కోచ్‌లు, 1 AC ఒక కోచ్ ఉన్నాయి. మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. 3 ACలో 611, 2 ACలో 188, 1 ACలో 324 బెర్త్‌లు ఉన్నాయి.
Also Read:
James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్
India: వెనెజువెలాపై అమెరికా దాడులు... భారత్ రియాక్షన్
Picture Puzzle: మీ పరిశీలనా శక్తి రేంజ్ ఎంత.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి