Share News

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:56 PM

న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం(ఢిల్లీ-టీటీడీ)లో ఈరోజు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు
TTD Delhi

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం(ఢిల్లీ-టీటీడీ)లో ఈరోజు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి పర్వేష్‌ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌, ఆలయ ఛైర్మన్‌ సుమంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు మొదలైన పవిత్రోత్సవాలు నవంబర్‌ 1 వరకు జరగనున్నాయి.


ఈ వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం, 31న పవిత్ర సమర్పణ, నవంబర్ 1న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. చివరి రోజు సాయంత్రం నాలుగు వీధులలో స్వామివారి తిరుచ్చి ఉత్సవం జరగనుంది.


ఈ వార్తలూ చదవండి

ఊటీ రైలు మార్గం సిద్ధం

కులం, మతం, డబ్బుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు: వెంకయ్య నాయుడు..

Updated Date - Oct 29 , 2026 | 08:01 PM