Share News

కులం, మతం, డబ్బుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు: వెంకయ్య నాయుడు..

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:55 PM

దేశ ప్రజలందరూ వికసిత్ భారత్ కోసం కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కులం, మతం, డబ్బు వంటి అంశాలతో కొన్ని శక్తులు దేశాన్ని విభజించాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

కులం, మతం, డబ్బుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు: వెంకయ్య నాయుడు..
Former President Venkaiah Naidu

ఢిల్లీ: కులం, మతం, డబ్బుతో కొన్ని శక్తులు దేశాన్ని విభజించాలని చూస్తున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అలాంటి శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత సానుకూల ఆలోచనలతో ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దేశ చట్టాలు, నిబంధనలను పాటిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తే దేశం బలోపేతమవుతుందని హితవు పలికారు. దేశ ప్రజలందరూ వికసిత్ భారత్ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో ‘భారత్ కీ సోచ్’ మంత్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా వికసిత్ భారత్ కోసం పౌరుల విధులపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు కీలక ప్రసంగం చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ కోసం ప్రజలంతా పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’, ‘వసుధైవ కుటుంబం’ అనే నినాదాలతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. సమాజంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవుతూ దేశభక్తితో మెలగాలని పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారా ప్రజలు మార్పును సాధించవచ్చని చెప్పుకొచ్చారు.


సమాజంలో శాంతియుత వాతావరణం ఎంతో ముఖ్యమని, అనవసర ఆందోళనల వల్ల నష్టం జరుగుతుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కుటుంబం నుంచి ప్రపంచం వరకు శాంతి ఎంతో అవసరమని చెప్పారు. పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ప్రజల ఆలోచనా శక్తి, సృజనాత్మకత తగ్గకూడదనీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ కోసం కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

జడ్జి కాబట్టి బెయిల్ ఇచ్చారా? హిట్ అండ్ రన్ కేసు బాధితుల ప్రశ్న

Updated Date - Oct 29 , 2026 | 04:07 PM