ఢిల్లీ రైల్వే యార్డులో అనుమానాస్పద మాంసం.. ప్రయాణికుల ఆహార భద్రతపై అనుమానాలు
ABN , Publish Date - Nov 09 , 2026 | 04:52 PM
ఢిల్లీ రైల్వే యార్డులో అనుమానాస్పద మాంసాన్ని పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. మటన్ పేరుతో తరలిస్తున్న ఈ మాంసం ఏ జంతువుకు చెందినదో తెలసుకోవడానికి ఫోరెన్సిక్ బృందం, వెటర్నిటీ వైద్యులను పోలీసులు రంగంలోకి దింపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ రైల్వే యార్డులో భారీగా అనుమానాస్పద మాంసం లభించింది. మటన్ పేరుతో తరలిస్తున్న ఈ మాంసం దేనిదో గుర్తించేందుకు ఫోరెన్సిక్, వెటర్నటీ వైద్యులను పోలీసులు రంగంలోకి దింపారు. ఈ మేరకు అనధికారిక ఈ- కేటరింగ్ యాప్‌లపై IRCTC (భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఉక్కుపాదం మోపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీ రైల్వే యార్డులో 1,286 కేజీల అనుమానాస్పద మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దక్షిణ ఎక్స్‌ప్రెస్ ద్వారా.. కొందరు అజ్ఞాతవ్యక్తులు ఈ మాంసాన్ని 20 థర్మాకోల్ బాక్సులలో ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మటన్ పేరుతో రవాణా అవుతున్న ఈ మాంసం దేనిదో తెలియదని.. ఆ విషయాన్ని తేల్చేందుకు ఫోరెన్సిక్, వెటర్నిటీ వైద్యులు శాంపిల్స్‌ను సేకరించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ-సాక్ష్య ద్వారా కేసు వివరాలు, ఆధారాలను జీఆర్పీ (GRP), ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్యే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అనధికారిక ఈ- కేటరింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపింది. ప్రయాణికుల ఆహార భద్రత కోసం విస్తృత స్థాయిలో తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ మేరకు అనధికారిక ఈ- కేటరింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. ప్రయాణికులు కేవలం 'Food on Track' యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారానే భోజనం బుక్ చేసుకోవాలని ఐఆర్సీటీసీ సూచించింది.
ఈ వార్తలనూ చదవండి:
యూపీ ఎన్నికలు.. 209 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు
భారతీయ పర్యాటకుల ప్రవర్తనపై హర్ష్ గోయెంకా సీరియస్..