Share News

అత్యాచార ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 13 , 2026 | 04:30 PM

అత్యాచార ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరాన్ని, నైతికతను వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. పరస్పర అంగీకార సంబంధం అత్యాచారం కాదని న్యాయస్థానం పేర్కొంది.

అత్యాచార ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Delhi High Court

న్యూఢిల్లీ, మే 13: అత్యాచార ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరాన్ని, నైతికతను వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. పరస్పర అంగీకార సంబంధం అత్యాచారం కాదని పేర్కొంది. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారంటూ ఓ వ్యక్తిపై.. మహిళ ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా వీరిద్దరూ పరస్పరాంగీకారంతో సహజీవనంలో ఉన్నారు. అయితే పెళ్లి చేసుకోలేదన్న కారణంతో ఇది అత్యాచారం కిందకు వస్తుందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది.


రాజ్యాంగబద్ధమైన నైతికత, సామాజిక నైతికతకు మధ్య తేడా ఉందని న్యాయస్థానం పేర్కొంది. సమాజం దృష్టిలో తప్పు అయినంత మాత్రాన.. అది నేరం కానక్కర్లేదని అభిప్రాయపడింది. నేర విచారణలో కేవలం నైతిక విలువల ఆధారంగా శిక్షలు విధించలేమని వెల్లడించింది. యువతీ యువకుల మధ్య సంబంధాలపై న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీచేసింది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని.. చట్టం పరిధిలోనే విచారణ ఉంటుందని జస్టిస్ అనూప్‌కుమార్ తెలిపారు. దీంతో పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారన్న కేసులో నిందితుడికి ఊరట లభించింది.


ఇవి కూడా చదవండి...

డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటింగ్‌కు చిరునామాగా అమరావతి: సీఎం చంద్రబాబు

విశాఖలో అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్

Read Latest National News And Telugu News

Updated Date - May 13 , 2026 | 04:45 PM